📄 ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
HomeTrending Newsకృతజ్ఞత కరువైన వృత్తి ఏదైనా ఉందంటే అది జర్నలిజమే..

కృతజ్ఞత కరువైన వృత్తి ఏదైనా ఉందంటే అది జర్నలిజమే..

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా..

ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం అని గొప్పగా కీర్తించబడే పత్రికా రంగం, ఆచరణలో ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల వాస్తవ పరిస్థితికి, బయట ప్రపంచం ఊహించుకునే దానికి మధ్య ఎంతో అంతరం ఉంది.

ఒక సామాన్యుడిని రాత్రికి రాత్రే ‘హీరో’ చేయాలన్నా, అధికార శిఖరాన ఉన్నవాడిని క్షణాల్లో ‘జీరో’గా మార్చాలన్నా జర్నలిస్టు కలం నుండి జాలువారే అక్షరమే ప్రధాన ఆధారం. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సమాజాన్ని మేల్కొలిపే బాధ్యతను మోస్తున్న విలేకరులకు దక్కే గుర్తింపు మాత్రం నామమాత్రమే. నిజం చెప్పాలంటే.. సమాజంలో అత్యంత కృతజ్ఞత కరువైన వృత్తి ఏదైనా ఉందంటే, నిస్సందేహంగా అది జర్నలిజమే అని చెప్పక తప్పదు.

అవసరానికి అందలాలు.. ఆపై ముఖం చాటింపులు..

 

నాయకులకో, వ్యాపార సంస్థలకో తమ వార్తలు ప్రముఖంగా ప్రచురితం కావాల్సిన వేళ.. విలేకరులను ప్రత్యేకంగా పిలిచి మరీ పూలదండలు వేస్తారు. పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఆకాశానికెత్తుతారు. అదే జర్నలిస్టు తన పత్రిక మనుగడ కోసం ఏదైనా పండుగకో, పత్రికా వార్షికోత్సవానికో చిన్న ‘యాడ్’ (ప్రకటన) అడిగితే చాలు.. నిన్నటి వరకు ఆప్యాయంగా పలకరించిన వారే నేడు దర్జాగా ముఖం చాటేస్తారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి ఎదురవుతుంది. అవసరానికి వాడుకుని, ఆదుకోవాల్సిన వేళకు అదృశ్యమయ్యే ఈ లోకపు ద్వంద్వ వైఖరికి విలేకరుల దైనందిన జీవితాలే సజీవ సాక్ష్యం.

ఇది కూడా చదవండి :  Gold & Silver Rates Today: భారీగా మారిన బంగారం వెండి ధరలు… కొనుగోలుదారులకు ఊరట.!

స్వేచ్ఛా జర్నలిజం.. ఒక ప్రశ్నార్థకం!

పత్రికల ఆర్థిక మనుగడ, ప్రకటనలపై ఆధారపడాల్సిన దుస్థితికి చేరినప్పుడు జర్నలిస్టుల కలానికి నిజమైన స్వేచ్ఛ ఎక్కడుంది? ఆదుకునే వారి లోపాలను నిలదీస్తూ వార్తలు రాయగల వాతావరణం ఉందా? ఈ దయనీయ పరిస్థితుల నడుమ నిష్పాక్షిక జర్నలిజానికి ఆస్కారం ఎక్కడ..?

నిజమైన పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ప్రభుత్వ సెన్సార్‌షిప్ లేకపోవడం మాత్రమే కాదు; ఒక జర్నలిస్టు తన వృత్తిని ఆత్మగౌరవంతో, దేహీ అని చేయి చాచకుండా, ఎవరికీ తలవంచకుండా నిర్వర్తించగలిగే వాతావరణం ఉండటం. ఈ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నాడు పౌర సమాజం తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అసలైన వాస్తవం ఇదే!

By… Qamar 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88