• ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమైన రైతులు
• బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండంతో రైతులు
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: వానకాలం మూడు నెలలా..? లేదా ఆరు నెలలా..? అని ప్రజల్లో ప్రశ్నలు ఉప్పన్నమవుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురవడంతో రైతులు అతలకు తలమవుతున్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు చాలా దీవిస్తాన్నే సృష్టించాయి. రైతులకు చేతుకొచ్చిన పంట నీటిపాలు అయింది. వర్షాకాలం ముగుస్తున్న కూడా మళ్లీ బంగ్లా ఖాతంలో వాయుగుండం నేర్పడంతో తెలంగాణలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి శనివారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఈ వాయుగుండం ఈనెల 26 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 27వ తేదీ ఉదయానికి నైరుతి బంగాళా ఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామంటున్న అధికారులు తెలిపారు.
Yellow alert : తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ కు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈజిల్లాల్లో 7 సెం.మీ. నుంచి 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరా బాద్లో కూడా కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈనెల 25, 26వ తేదీల్లో అక్కడక్కడ కాస్త జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనెల 27 తర్వాత అల్పపీడనం తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
