HomeEducationGet-together | ఆగస్టు 9న ఇచ్చోడ జెడ్పీఎస్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Get-together | ఆగస్టు 9న ఇచ్చోడ జెడ్పీఎస్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

• 2003 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక

• ఏర్పాట్లు చేస్తున్న శ్యామ్ రెడ్డి, జాకీర్, శివ, విలాస్, మనోజ్, లక్ష్మణ్, షఫీ తదితరులు

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ (ZPSS) 2003 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆగస్టు 9వ తేదీ, ఆదివారం రోజున ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ మేరకు పూర్వ విద్యార్థులు జాకీర్, శివ, శామ్ రెడ్డి, షఫీ, విలాస్, మనోజ్, లక్ష్మణ్ లు మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిన్ననాటి మిత్రులందరం ఒకచోట కలుసుకునేందుకు ఈ సమ్మేళనం (Get-together) వేదిక కానుందన్నారు. పాఠశాల రోజుల్లోని తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ, ఒకరి బాగోగులు మరొకరు పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆదివారం జరిగే ఆత్మీయ కలయికకు 2003 బ్యాచ్ కు చెందిన మిత్రులందరూ పెద్ద సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular