📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadOperation kaghar | మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా లొంగిపోతాడా..?

Operation kaghar | మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా లొంగిపోతాడా..?

వాస్తవ నేస్తం,హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను రూపుమాపేందుకు ఆపరేషన్ కాగార్ పేరిట (operation kaghar) చత్తీస్గడ్ (Chhattisgarh)అడవుల్లో పెద్ద ఎత్తున భద్రతల బలాలను రంగంలోకి దించింది. తుపాకులతో పోరాటం చేయడం కోసం కాలం చెల్లింది అని ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షుల నిలబడతామని మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ఒకరు ఒకరు పోలీసులకు లొంగిపోతున్నారు. అడవిలో ఉండి ఇక సాధించింది చాలా చాలు అని ఇప్పుడు ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మావోయిస్టు పార్టీ కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. దీంతో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మాడవి హిడ్మా గురించి పోలీసులు పెద్ద ఎత్తున సర్చ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్న, మల్లోజుల కోటేశ్వరరావు సతీమణి సుజాత సహా పలువురు ముఖ్య నాయకులు, వందల సంఖ్యలో క్షేత్ర స్థాయిలోని కేడార్ తెలంగాణ, (Telangana) ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర పోలీసులకు ఇటీవల లొంగిపోయారు. వీరి లొంగుబాటును మావోయిస్టు పార్టీ కుట్రగా అభివర్ణిస్తూనే లొంగిపోయిన వారంతా ద్రోహులని పేర్కొనడం విదితమే. అయినప్పటికీ మావోయిస్టుల వరుస లొంగుబాట్లు ఆగడం లేదు. తాజాగా ఆదివారం నాడు ఛతీస్ గాడ్ లో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తమ కేడర్తో కలిసి లొంగిపోయారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగులబోతోందని ప్రచారం జరుగుతుంది.

ఇది కూడా చదవండి :  Cyclone Montha effect | ప‌లు రైళ్లు ర‌ద్దు

Telangana : లొంగుబాటలో మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా..?

మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు, పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కా ర్యదర్శి మాడవి హిడమ్ముయ్ అలియాస్ హిడ్మా (Hidma) పోలీసులకు లొంగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సహచరులతో పాటు భారీగా ఆయుధాలతో ఆయన లొంగిపోయేందుకు నిర్ణయించి నట్లుగా కూడా చెబుతున్నారు. మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్న తరహాలో భారీ కేడర్తో కలిసి లొంగిపోయేందుకు హిడ్మా నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ముఖ్యమైన వారిలో ఒకరుగా పేరొందడం తెలిసిందే. ఛతీస్ గాడ్ లో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా సూత్రధారిగా వుండడం గమనార్హం. గెరిల్లా యుద్ద తంత్రంలో హిడ్మా ఆరితేరినట్లు పోలీసులు పలుమార్లు ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా గిరిజనతెగకు చెందిన వ్యక్తి. గిరిజనులను పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీలో చేర్పించడంలో ఆయన చొరవ తీసుకున్నారని మావోయిస్టు పార్టీ అనేకమార్లు ప్రకటించింది.

హిడ్మా లొంగుబాటు కోసం ఛత్తీస్ ఘడ్ (chhattishrarh) తెలంగాణ పోలీసు విభాగాలు అంతర్గతంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. హిడ్మాపై ఛతీస్ గాడ్ లో పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఇందులో మెజారిటీ కేసులు భద్రతాబలగాలపై దాడులకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇదే సమయంలో ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ, ఎపిలోనూ కేసులున్నాయి. కాగా హిడ్మా లొంగిబాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ పోలీసులు చెబుతుండగా ఛత్తీస్ ఘడ్ పోలీసులు మౌనం వహించసాగారు. గతంలో మల్లోజుల వేణుగోపాల్రావు, ఆశన్నల లొంగుబాటు సందర్భంగా కూడా పోలీసులు మౌనం వహించారు. హిడ్మా పై ఐదుకోట్ల రూపాయలకు పైగా రివార్డు వుంది. హిడ్మా లొంగి పోతే మావోయిస్టుపార్టీలో ముఖ్యనాయకులు ఐదారుగురు మాత్రమే వుంటారని పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి :  చేతిలో అధికారం ఉన్నా... వీధుల్లో 'డ్రామా'!️

Madavi hidma | అసలు ఈ హిడ్మా ఎవరు..?

హిడ్మా అసలు పేరు మాడవి హిడమ్ముయ్. ఆయన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ కీలక నాయకుడు. (Madavi hidma )హిడ్మా లొంగిపోతున్నాడనే వార్త ఎందుకు చర్చనీయాంశమైంది..? మావోయిస్టు పార్టీలో వరుసగా ప్రధాన నాయకులు లొంగిపోతున్న సమయంలో హిడ్మా కూడా పోలీసులకు లొంగబోతున్నాడని వార్తలు రావడంతో ఆసక్తి పెరిగింది. ఏది ఏమైనా అప్పటికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తోనే (operation kaghar)మావోయిస్టు పార్టీ నేతలు లొంగిపోతున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page