HomeTelanganaBhadradri KothagudemACB Ride | ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి

ACB Ride | ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి

📰 Generate e-Paper Clip

వాస్తవ నేస్తం,భద్రాద్రి కొత్తగూడెం: వ్యవసాయ భూమికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. (Tahsildar office) తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే గ్రామ ప‌రిపాల‌న అధికారి ఒక ప‌నిచేయ‌డానికి రూ.60 వేలు డిమాండ్ చేసి రూ.15 వేలు తీసుకుంటూ ఈ రోజు ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ముల‌క‌ల‌ప‌ల్లి త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండ‌గా వీఆర్ఓ బానోత్ శ్రీ‌నివాస్ నాయ‌క్ (village revenue officer) ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. పూసుగేడెం గ్రామానికి చెందిన వ్య‌వ‌సాయ భూమి రిజిస్ర్టేష‌న్ కు సంబంధించి రూ.60 వేలను వీఆర్ఓ బానోత్ శ్రీ‌నివాస్ నాయ‌క్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు వద్ద నుండి రూ.40 వేలు తీసుకోగా మిగతా బాలన్స్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఈ రో్జు ఉదయం 11 గంటల సమయంలో ఏసీబీ (anti corruption bureau) అధికారులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుత విచార‌ణ కొన‌సాగుతోంది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular