📄 ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadMentha Cyclone | మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోనూ భారీ వర్షాలు..?

Mentha Cyclone | మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోనూ భారీ వర్షాలు..?

తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్‌అలర్ట్.. కుండపోత వర్షాలకు చాన్స్..!?

Mentha Cyclone | మొంథా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు నీటమున ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొంథా తుఫాన్ తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. ఈ తుపాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత తుఫాన్ gaa బలపడి ఏపీలో విజృంభిస్తుంది. మంగళవారం తీవ్ర తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని IMD ( Indian metrological department) ఐఎండీ పేర్కొంది. ఆ తరువాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరందాటుతుందని ఐఎండీ ( Indian metrological department) అంచనా వేసింది. తుపాను కారణంగా (Andhra Pradesh) ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) జారీ అయింది.

motha cyclone effect in Telangana | తెలంగాణలోని ఈ జిల్లాలలోనే మొంథా తుఫాన్ ఎఫెక్ట్ : 

ఇది కూడా చదవండి :  Chhattisgarh | భద్రత బలగాలకు తప్పిన పెను ప్రమాదం..?! ఆ మందు పాత్ర ఎవరికోసం.?

తుఫాన్ భావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేశారు. కుమురం భీం ఆసిపాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ ( komaram Bheem asifabad, mancherial, peddapalli, Khammam, Warangal, Hanamkonda, bhadradri kothagudsm, Mahabubnagar) తోపాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

బుధవారం అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ (Telangana weather department) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం.. తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో ముసురు ఉండే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page