వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు కేసుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు మొహమ్మద్ ఫారూక్ ఖాన్, అతని డ్రైవర్ బస్సీ రమేష్ లను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ కు చెందిన ఇమ్రానా జబీన్ కనిపించడం లేదని ఆమె సోదరి, 29 నవంబర్ 2025న మావల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. విచారణలో ఇమ్రానా జబీన్, జిల్లాలోని ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఫారూక్ మధ్య ఆర్థిక వివాదం ఉన్నట్లు తేలింది నిందితులు ఫారూక్ మరియు బస్సీ రమేష్‌ను దస్నాపూర్ కూరగాయల మార్కెట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హత్యలో పాల్పడ్డారని తెలిపారు. నిందితుడు ఫారూక్, మహిళ వద్ద నుండి సుమారు రూ.8.8 లక్షల నగదు, 8.5 తులాల బంగారం తీసుకొని కొద్దవ పెట్టారు. మృతురాలు డబ్బు తిరిగి అడగడంతో, నిందితులు హత్యకు కుట్ర పన్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు కల్వర్ట్ సమీపంలో మృతదేహం ను పూడ్చారు. DNA, దుస్తుల ఆధారాలతో కుటుంబ సభ్యులు మృతురాలిని గుర్తించారు

