HomeBreaking Newsస్వచ్ఛంద వేశ్యావృత్తి నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

స్వచ్ఛంద వేశ్యావృత్తి నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

• వయోజనులు ఇష్టపూర్వకంగా ఎంచుకుంటే ఆర్టికల్ 21 ప్రకారం హక్కు

• సెక్స్ వర్కర్లకు రాజ్యాంగపరమైన గౌరవం, సమాన రక్షణ ఉందన్న కోర్టు

• పోలీసుల వేధింపులు, అరెస్టులు తగవని ధర్మాసనం స్పష్టీకరణ

• రైడ్స్ సమయంలో బలవంతంగా రెస్క్యూ హోమ్స్‌కు తరలించొద్దు

• వ్యభిచార గృహాల నిర్వహణ, అక్రమ రవాణా మాత్రం నేరమే

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: సెక్స్ వర్కర్ల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

భారత రాజ్యాంగం (Indian Constitution) ప్రకారం వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని (Sex Work) ఎంచుకునే హక్కు ఆర్టికల్ 21 కల్పించే ‘జీవించే హక్కు’లో భాగమని ధర్మాసనం తేల్చిచెప్పింది. 18 సంవత్సరాలు నిండిన వారిని వయోజనులుగా (Adults) పరిగణించాలన్న కోర్టు.. లైంగిక కార్మికులు కూడా సమాజంలో గౌరవం, చట్టం ముందు సమాన రక్షణ పొందే హక్కు కలిగిన వృత్తి నిపుణులేనని (Professionals) కుండబద్దలు కొట్టింది.

పోలీసుల వేధింపులకు అడ్డుకట్ట..

సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు పోలీసులు (Police) వారిని వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం లాంటివి చేయకూడదని సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. వ్యభిచార గృహాలపై దాడులు (Raids) జరిగిన సందర్భాల్లో, సెక్స్ వర్కర్లను బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్లకు తరలించరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సెక్స్ వర్కర్ల వద్ద కండోమ్‌లు (Condoms) లభించడాన్ని వారిపై నేరాన్ని మోపే సాక్ష్యంగా పరిగణించరాదని, వారి గోప్యతను (Privacy) దెబ్బతీసేలా పోలీసుల వ్యవహారశైలి ఉండకూడదని హితవు పలికింది.

లైంగిక కార్మికులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించినప్పటికీ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై కోర్టు స్పష్టత ఇచ్చింది. స్వచ్ఛందంగా కాకుండా, వ్యభిచార గృహాలు (Brothels) నిర్వహించడం, ఇతరులను బలవంతంగా ఈ కూపంలోకి నెట్టడం, అలాగే మానవ అక్రమ రవాణా (Human Trafficking) చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగానే పరిగణించబడుతుందని ధర్మాసనం తన తీర్పు

లో స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular