HomeTelanganaAdilabadఎడతెరిపిలేని వర్షం.. దుబార్‌పేట (బి) గ్రామంలో ఇండల్లోకి వరద నీరు

ఎడతెరిపిలేని వర్షం.. దుబార్‌పేట (బి) గ్రామంలో ఇండల్లోకి వరద నీరు

• ఇబ్బందుల్లో గ్రామస్తులు.. చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా గతరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ఏకధాటిగా పడుతున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బయటకు రాలేని పరిస్థితిలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు ఇచ్చోడ మండలంలోని దుబార్‌పేట (బి) గ్రామంలో వానల ప్రభావంతో గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులుస్పందించి గ్రామంలోకి వరద నీరు రాకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని దుబార్‌పేట (బి) గ్రామస్తులు కోరుతున్నారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా కాలువలను క్లియర్ చేయాలని, ముంపునకు గురైన కుటుంబాలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular