HomeCrime Newsమొక్కజొన్నల బకాయిల ఎగవేత.. రైతును మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

మొక్కజొన్నల బకాయిల ఎగవేత.. రైతును మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

• రూ. 7.70 లక్షలకు పైగా బాకీ పడిన నిందితుడు

• ఐదు నెలలుగా కాలయాపన చేయడంతో పోలీసులను ఆశ్రయించిన రైతులు

• ఇచ్చోడలో వెలుగు చూసిన ఘటన

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మొక్కజొన్నలు కొనుగోలు చేసి, రైతులకు డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి, బకాయిలు చెల్లించకుండా ఐదు నెలలుగా కాలయాపన చేస్తున్న నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ ఎస్హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

ఎస్హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం ఆడేగాం-కె గ్రామానికి చెందిన రైతుల వద్ద మాధాపూర్ గ్రామానికి చెందిన ఎం.డి. ముజాహిద్ (33) మొక్కజొన్నలు కొనుగోలు చేశాడు. కొంత నగదు చెల్లించినప్పటికీ, మిగిలిన బకాయిలను ఇవ్వకుండా గత ఐదు నెలలుగా రైతుల చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నాడు.

దీంతో విసిగిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రైతు అరుగుల సాయికృష్ణ తనకు రావాల్సిన రూ. 68,562 బకాయి చెల్లించకుండా మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చోడ మండలంలోని ఆడేగాం-కె గ్రామానికి చెందిన తుమ్ముల సుధాకర్ రెడ్డి – రూ. 1,40,000 , బొబ్బెల్లి శాంతికుమార్ – రూ. 1,50,000 , శ్రీపల్లి శ్రీనివాస్ – రూ. 2,00,000 , కల్లెం రవీందర్ రెడ్డి – రూ. 2,00,000 , తొర్తి నరేష్ – రూ. 80,000 , అరుగుల సాయికృష్ణ – రూ. 68,562 ఆయన రైతులు మోసపోయారు. మొత్తం ఐదుగురు రైతులకు సంబంధించి సుమారు రూ. 7.70 లక్షల మేర మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్హెచ్‌ఓ వి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎం.డి. ముజాహిద్ (33), సొంతూరు ఇచ్చోడ మండలంలోని మాధాపూర్ గ్రామం కాగా, ప్రస్తుతం ఇస్లాంపుర కాలనీలో నివసిస్తున్నాడు

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular