- ప్రజాసేవే తన బాట..
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అహర్నిశలు కృషి
- రెండుసార్లు వార్డ్ మెంబర్ గా ఓడినా.. నిరాశ చెందకుండా ప్రజాసేవ
- అలుపెరుగని తన ప్రజాసేవను గుర్తించి వార్డ్ మెంబర్ గా గెలిపించిన ప్రజలు
- సోషల్ యాక్టివిస్ట్ , బీఆర్ఎస్ నాయకుడు , నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్ అబ్దుల్ సబీర్ పై వాస్తవ నేస్తం ప్రత్యేక కథనం
వాస్తవ నేస్తం, ఆదిలాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటమి ఒక ముగింపు కాదు… అది మరో పోరాటానికి ఆరంభం. ఈ మాటలను తన జీవితంతో నిరూపించిన వ్యక్తి అబ్దుల్ సబీర్.
రెండుసార్లు వార్డ్ మెంబర్ ఎన్నికల్లో ఓడిపోయినా నిరాశకు లోనుకాక, ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలనే తన సమస్యలుగా భావిస్తూ, అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమైన వ్యక్తిత్వం ఆయనది. చివరికి అదే ప్రజలు తన సేవలను గుర్తించి,
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఏడవ వార్డు నుంచి వార్డ్ మెంబర్ గా గెలిపించి మంచి గుర్తింపు అందించారు. రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాజిక కార్యకర్తగా కూడా సబీర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఓటమిలోనూ ఆత్మవిశ్వాసం…
సబీర్ కు రాజకీయ పదవులు లక్ష్యం కాదు.. ప్రజలకు సేవ చేయడమే ఆయన ఆశయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా అధికారుల చుట్టూ తిరగడం,
పేద కుటుంబాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం,
వృద్ధులకు పెన్షన్లు, దివ్యాంగులకు సహాయం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందేలా కృషి చేయడం ఆయన నిత్యకర్తవ్యం.
కరోనా కాలంలోనూ ప్రజల మధ్యే ఉంటూ, ఆహార కిట్లు, మందులు, సహాయం అందించడంలో ముందుండారు. వార్డ్ మెంబర్‌గా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయినప్పుడు
చాలా మంది రాజకీయాలకు దూరమవుతారు. కానీ అబ్దుల్ సబీర్ మాత్రం అలా చేయలేదు. ఓటమిని స్వీకరించి,
ప్రజల తీర్పును గౌరవిస్తూ, మరింత నిబద్ధతతో సేవలను కొనసాగించారు. “పదవి లేకపోయినా సేవ చేయొచ్చు” అన్న తన మాటలను చేతలతో చూపించారు. ఇదే ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది.
బీఆర్ఎస్‌లో చురుకైన నాయకత్వం..
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా,
ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘ కాలంగా సాగిన ఆయన అలుపెరుగని సేవలకు
చివరికి ప్రజలే తీర్పు చెప్పారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఏడవ వార్డు ప్రజలు సబీర్ ను వార్డ్ మెంబర్‌గా ఎన్నుకొని,
ఆయనపై తమ విశ్వాసాన్ని చాటారు. ఇది ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు… ప్రజాసేవకు లభించిన గెలుపు. ఓటములను ఎదుర్కొని కూడా ప్రజల మధ్యే ఉన్న వ్యక్తికి ప్రజలు ఇచ్చిన గౌరవం ఇది.
యువతకు ఆదర్శం.. సబీర్
నేటి యువతకు సబీర్ ఒక ఆదర్శం. ఓటమిలో కుంగిపోకుండా,
కష్టాల్లోనూ ప్రజల కోసం నిలబడితే, ప్రజలే మిమ్మల్ని నిలబెడతారన్న సందేశాన్ని ఆయన జీవితం చెబుతోంది. పదవి కంటే సేవ ముఖ్యం అన్న తత్వాన్ని ఆయన ప్రతి అడుగులో ప్రతిబింబిస్తున్నారు. గారిబోక మసిహా అబ్దుల్ సబీర్ పేరు నేడు ఇచ్చోడ ప్రజల్లో ఆశ, విశ్వాసానికి ప్రతీకగా మారింది.
ప్రజాసేవే తన బాటగా ఎంచుకుని, అలుపెరుగని కృషితో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఆయన.
నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా,
బీఆర్ఎస్ నాయకుడిగా సబీర్ ప్రయాణం ఇంకా ఎంతో మందికి ప్రేరణనిచ్చేలా కొనసాగాలని ఆశిద్దాం.
