📄 ePaper
Saturday, March 7, 2026
📄 ePaper
HomeCrime Newsమత విద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై కేసు నమోదు : బోథ్ సీఐ గురు స్వామి

మత విద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై కేసు నమోదు : బోథ్ సీఐ గురు స్వామి

ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా వాట్సాప్ లో పోస్ట్

పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: వాట్సాప్ గ్రూప్ లో (WhatsApp Group) ఇరువర్గాలను రెచ్చగొట్టేలా పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు చేసినట్లు బోథ్ సీఐ గురు స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణంలో ‘బోథ్ డెవలప్మెంట్ ఫారం’ అనే వాట్సప్ గ్రూపు లో ఇరు వర్గాలను రెచ్చగొట్టే లా పోస్ట్ చేసిన బొడ్డు శ్రీనివాస్ , అదేవిధంగా గ్రూప్ అడ్మిన్ పాలిక్ రమేష్ లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో (Social Media) ఇరు వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై , ఆ గ్రూపుల అడ్మిన్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ చేసిన వారి వివరాలు పోలీసులకు తెలుపాలన్నారు.విదేశాలలో ఉండి వాట్సప్ గ్రూపులలో పోస్టులు చేసిన వారిపై ఎల్ఓసి జారీచేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇతర దేశాలలో ఉండి ఇక్కడి గ్రూపుల నందు రెచ్చగొట్టేలా పోస్టులు చేసిన వారూ చట్టం దృష్టిలోనే తప్పించుకోలేరని సిఐ హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి :  Operation Hidma : ఆఫరేషన్‌ హిడ్మా సక్సెస్‌..200 మందితో లొంగుబాటు.?
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page