📄 ePaper
Saturday, March 7, 2026
📄 ePaper
HomeCinema NewsCm revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ.. షూటింగ్స్ రద్దు చేసిన...

Cm revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ.. షూటింగ్స్ రద్దు చేసిన ఫిలిం ఫెడరేషన్

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఈ రోజు సాయంత్రం(Tuesday) యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కి సినీ కార్మికుల అభినందన సభ (Film workers’ appreciation meeting) జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ పెద్దలు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉండటంతో ఈ అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thimmala Nageshwar Rao) దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తో అభినందన సభ ఉండటం, సినిమా ఇండస్ట్రీకి కీలక కావడంతో ఫిలిం ఫెడరేషన్ (Film Federation) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరగాల్సిన అన్ని షూటింగ్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డికి (Congratulatory meeting for CM Revanth Reddy) సినీ కార్మికులు చేస్తున్న సన్మాన సభ కావడంతో అన్ని యూనియన్లలోని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి :  Full details of Kaveri Travels Bus Accident : కర్నూలు బస్ ప్రమాదం.. పూర్తి వివరాలు..
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page