📄 ePaper
Friday, May 1, 2026
📄 ePaper
HomeEducationఅక్షర శిఖరాన ‘గౌతమ్’ కేతనం: పదో తరగతి ఫలితాల్లో ఆదిలాబాద్ గౌతమ్ మోడల్ స్కూల్ క్లీన్...

అక్షర శిఖరాన ‘గౌతమ్’ కేతనం: పదో తరగతి ఫలితాల్లో ఆదిలాబాద్ గౌతమ్ మోడల్ స్కూల్ క్లీన్ స్వీప్

 

 

  • జిల్లా స్థాయి ర్యాంకులతో అదరగొట్టిన విద్యార్థులు

  • 580 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచిన షేక్ జయాన్

  • 100% ఉత్తీర్ణతతో విద్యాక్షేత్రంలో సరికొత్త రికార్డు

  • విద్యార్థుల ప్రతిభను కొనియాడిన డైరెక్టర్ భరత్ మరియు డీన్ రాందాస్

వాస్తవ నేస్తం, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి (S.S.C) ఫలితాల్లో విజయభేరి మోగించారు. తాజాగా విడుదలైన 2025-26 ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని, తమ పాఠశాల పేరును మారుమోగించారు. క్రమశిక్షణతో కూడిన విద్య, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణే ఈ విజయానికి పునాది అని నిరూపించారు.

ఈ ఏడాది పరీక్షలకు పాఠశాల నుండి మొత్తం 66 మంది విద్యార్థులు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలను నమోదు చేశారు. వీరిలో షేక్ జయాన్ 580 మార్కులు సాధించి జిల్లా స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు.

టాప్ ర్యాంకర్ల వివరాలు :

  • షేక్ జయాన్: 580 మార్కులు (ప్రథమ స్థానం)
  • టి. నందిని: 571 మార్కులు (ద్వితీయ స్థానం)
  • రాంచరణ్: 567 మార్కులు (తృతీయ స్థానం)
  • సాక్షి: 567 మార్కులు (తృతీయ స్థానం)

మెరిసిన ఆణిముత్యాలు :

కేవలం టాపర్లు మాత్రమే కాకుండా, పాఠశాల విద్యార్థులు సమిష్టిగా అత్యుత్తమ స్కోర్లు సాధించారు. మొత్తం విద్యార్థులలో 12 మంది 550 పైగా మార్కులు సాధించి సత్తా చాటారు. 33 మంది విద్యార్థులు 500 పైగా మార్కులతో అత్యున్నత శ్రేణిలో నిలిచారు. సామాజికంగా, ఆర్థికంగా భిన్న నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు సైతం గౌతమ్ మోడల్ స్కూల్ అందించిన శిక్షణతో మేటి మార్కులు సాధించడం విశేషం.

ఇది కూడా చదవండి :  Mediguda Ashram School : మేడిగూడ ఆశ్రమ బాలికల పాఠశాలలో నిత్యావసర సరకులు పక్కదారి

విజయీభవ.. విద్యార్థులకు ఘన సన్మానం..

ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ.. “శిక్షణకు, నాణ్యమైన చదువుకు మారుపేరుగా మా సంస్థ నిలుస్తుందని విద్యార్థులు మరోసారి నిరూపించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి వారిలోని ప్రతిభను వెలికి తీయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

పాఠశాల డీన్ రాందాస్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కష్టం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అజేయమైన ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వర్మ, వైస్ ప్రిన్సిపాల్ సాజిల్ మరియు బోధనా సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచడంలో గౌతమ్ మోడల్ స్కూల్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88