📄 ePaper
Tuesday, May 26, 2026
📄 ePaper
HomeTelanganaNirmalLucky draw for wine shops | అదృష్టం అంటే ఇది కాదా..!

Lucky draw for wine shops | అదృష్టం అంటే ఇది కాదా..!

మద్యం దుకాణాల లక్కీ డ్రా లో ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు

వాస్తవ నేస్తం,నిర్మల్ : అదృష్టం ఎవరికీ ఏలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. మద్యం దుకాణాల టెండర్ల కోసం ప్రభుత్వం లక్కీ డ్రాను నిర్వహిస్తోంది. మద్యం దుకాణాలను దక్కించుకోవడం కోసం ఒక్కొక్కరు పరదేసి దరఖాస్తులు చేసిన కూడా లక్కీ డ్రాలో ఒక్క మద్యం దుకాణం కూడా రాకపోవడంతో దుఃఖంతో వెనుదిరిగినవారు ఎందరో ఉన్నారు. కానీ ఓ మహిళ మద్యం దుకాణం కోసం చేసిన దరఖాస్తులకు గాను లక్కీ డ్రా లో ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా లో ఆమెకు రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నది. అదృష్టం అంటే ఇలా ఉండాలి అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular