వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య చిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేవారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి ·జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేవారు. అలాగే పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు ఎపిలోని నెల్లూరు, ప్రకాశంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల భారీ నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్