HomeTelanganaAdilabadమానవత్వం చాటుకున్న సమీర్ ఖురేషీ.. తల్లి ప్రాణాలు నిలిపినందుకు ధన్యవాదాలు

మానవత్వం చాటుకున్న సమీర్ ఖురేషీ.. తల్లి ప్రాణాలు నిలిపినందుకు ధన్యవాదాలు

వాస్తవ నేస్తం, ఇచ్చోడ: అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఓ తల్లి ప్రాణాలు నిలపడంలో కీలక పాత్ర పోషించిన యువకుడు సమీర్ ఖురేషీకి బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన అజయ్ అనే వ్యక్తి తల్లి అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ తల్లికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా, విషయం తెలుసుకున్న మండల కేంద్రానికి చెందిన సమీర్ ఖురేషీ  వెంటనే స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సకాలంలో రక్తం అందించి ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ‘సమీర్ భాయ్’కి జీవితాంతం రుణపడి ఉంటామని వారు భావోద్వేగంగా తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఆపద సమయంలో తోటి వారికి అండగా నిలవడం గొప్ప విషయమని, నిస్వార్థంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్న సమీర్ ఖురేషీ ని పలువురు స్థానికులు సైతం అభినందించారు.

.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular