📄 ePaper
Monday, February 9, 2026
📄 ePaper
HomeBusinessSilver Rates: సంక్రాంతికైనా తగ్గేదేలే! వెండి ధరల దూకుడు.. కిలోపై మరో రూ.5,000 జంప్

Silver Rates: సంక్రాంతికైనా తగ్గేదేలే! వెండి ధరల దూకుడు.. కిలోపై మరో రూ.5,000 జంప్

సంక్రాంతి పండగ సమయంలో అయినా వెండి ధరలు కాస్త తగ్గుతాయేమోనని వినియోగదారులు ఆశించారు. కానీ అంచనాలకు విరుద్ధంగా ఈరోజు కూడా వెండి ధరలు భారీగా పెరిగి కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి.

నిన్ననే కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కును దాటగా, తాజాగా మరోసారి రూ.5,000 పెరిగి మరింత ఎగబాకింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,10,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది.

మొత్తం మీద చూస్తే, పండగ సీజన్ అయినా సరే వెండి ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పెరుగుతున్న గ్లోబల్ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, ఇండస్ట్రియల్ వినియోగం పెరగడం వంటి కారణాలు ధరల ర్యాలీకి దారితీస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

సిల్వర్ రికార్డ్ ర్యాలీ.. మార్కెట్‌లో ఏమవుతోంది?

ఈరోజు ఒక్క రోజే కిలో వెండిపై రూ.5,000 పెరుగుదల నమోదైంది. బులియన్ మార్కెట్‌లో:

  • హైదరాబాద్, చెన్నై: రూ.3,10,000 / కిలో
  • ఢిల్లీ, ముంబై, కోల్‌కతా: రూ.2,95,000 / కిలో

వెండి ధరలు ఇలా నిరంతరం పెరగడం వల్ల ఆభరణాల కొనుగోలుదారులు, వెండి వస్తువుల వినియోగదారులపై భారం పెరుగుతోంది. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం ఇది లాభదాయకమైన ట్రెండ్‌గా మారుతోంది.

stack of pure silver bars with blurred market background
Stack of pure silver bars symbolizing record-breaking price surge in India

బంగారం ధరల్లో ఉపశమనం.. ఈరోజు రేట్లు ఇవే

వెండి దూకుడు కొనసాగుతున్నప్పటికీ, ఈరోజు బంగారం ధరలు మాత్రం కాస్త తగ్గి వినియోగదారులకు ఊరట ఇచ్చాయి.

  • 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,43,180 (రూ.820 తగ్గింది)
  • 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,31,250 (రూ.750 తగ్గింది)
  • 18 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,07,390 (రూ.610 తగ్గింది)
ఇది కూడా చదవండి :  Year Ender 2025: ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే.?

అంటే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చిన్న ఉపశమనంగా చెప్పొచ్చు. కానీ వెండి మాత్రం తగ్గే మూడ్‌లో కనిపించడం లేదు. సంక్రాంతి కైనా వెండి ధరలు తగ్గే సూచనలు లేవు.. రికార్డ్ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. బంగారం మాత్రం స్వల్పంగా దిగొచ్చింది.

Author : QAMAR SD, Vaasthava Nestham

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page