📄 ePaper
Saturday, March 7, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadVoice Scam | గొంతు మార్చి.. ప్రజలను దోచేసి..!

Voice Scam | గొంతు మార్చి.. ప్రజలను దోచేసి..!

అమ్మాయి గొంతుతో పలువురిని మోసం చేసిన కేటుగాళ్లు 

ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ముఠా అరెస్ట్

రూ 1.5 లక్షలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : వలపు వలవేసి ఏం చెక్క దోచేయడం ఆ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. గొంతులు మార్చి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలో డిఎస్పి జీవన్ రెడ్డి పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాధితుడు తన వివాహానికై ఆన్లైన్, యుట్యూబ్ లో వివాహ వధువుల కొరకై శోధిస్తున్న సమయంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫోటోతో యూట్యూబ్ నందు రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమై కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజి అనే మోసగాని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడు మాలోత్ మంజి బాధితున్ని కృష్ణవేణి అనే అమ్మాయి పేరుతో, మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలని తన ఆస్తులు కోర్టు నందు పెండింగ్ కేసులో ఉన్నాయని నమ్మబలికి, లాయర్ కి డబ్బులు ఇవ్వాలని.. వివాహం తర్వాత తన ఆస్తులను తన వ్యాపారాన్ని బాధితుడు చూసుకోవచ్చు అని నమ్మబలికి బాధితుని వద్ద నుండి వద్దనుండి విడతలవారీగా ఎనిమిది రూ.8 లక్షలు తీసుకున్నాడు. అదేవిధంగా తనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయని వాటన్నింటిని నువ్వే చూసుకోవాలని నమ్మ బలికాడు. ఈ క్రమంలో మహిళ గొంతుతో మాట్లాడిన ప్రధాన నిందితుడి మోసం గ్రహించకుండా మాటల్లో పడిన బాధితుడు తనకు విడుదలవారీగా ఎనిమిది లక్షలు ఇచ్చి మోసపోయాడు. ఆలసంగా జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు సైబర్ ఫిర్యాదు చేయగా, ఈనెల 25వ తేదీన ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సూర్యాపేట జిల్లా వద్ద నుండి ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి, నిందితుల వద్ద నుండి ఒకటిన్నర లక్షల రూపాయల నగదు, మూడు మొబైల్స్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :  బోథ్ గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాయిదా పడనుందా..?
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page