Friday, May 8, 2026
HomeTrending NewsVaasthava Nestham | ప్రశ్నించే గొంతుకకు నెటిజన్ల సపోర్ట్..!

Vaasthava Nestham | ప్రశ్నించే గొంతుకకు నెటిజన్ల సపోర్ట్..!

• డిజిటల్ మీడియాలో ‘వాస్తవ నేస్తం’ ప్రభంజనం
 • ఏకంగా 33 లక్షల ఇంప్రెషన్స్.. 3 లక్షల పైచిలుకు క్లిక్స్
 • రోజుకు లక్షల్లో వ్యూస్.. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణ
 నిఖార్సయిన జర్నలిజానికి అండగా నిలుస్తున్న పాఠకులు

నిజాయితీగా వార్తలను అందించడమే కాకుండా, ప్రజా పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకకు సమాజంలో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ‘వాస్తవ నేస్తం’ మరోసారి నిరూపించింది. సమాజ హితమే ధ్యేయంగా అక్షర సమరం చేస్తున్న వాస్తవ నేస్తం.. ఇప్పుడు డిజిటల్ వేదికపై సంచలనాలు సృష్టిస్తోంది. నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన దక్కించుకుంటూ నంబర్ వన్ దిశగా దూసుకుపోతోంది.

తాజా గణాంకాలే ఈ ప్రభంజనానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే వాస్తవ నేస్తం డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏకంగా 33.9 లక్షల (3.39 మిలియన్ల) ఇంప్రెషన్స్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే 3 లక్షల 2 వేలకు పైగా (302K) నెటిజన్లు నేరుగా మన కథనాలను క్లిక్ చేసి చదివారు. ప్రతిరోజూ లక్షలాది మంది వీక్షిస్తూ, వాస్తవ నేస్తం వెబ్‌సైట్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ వ్యూయర్‌షిప్ అఖండమైన ప్రజాదరణకు అద్దం పడుతోంది.

నిర్భయంగా అన్యాయాన్ని ప్రశ్నించే వారికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ప్రజలు మాపై ఉంచిన ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. రాబోయే రోజుల్లోనూ ‘వాస్తవ నేస్తం’ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిఖార్సయిన జర్నలిజంతో, మరింత బాధ్యతగా అణగారిన వర్గాల తరఫున, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన గొంతుకను బలంగా వినిపిస్తూనే ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular