Wednesday, May 27, 2026
HomePolitical Newsసుంకర నరేష్‌ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు

సుంకర నరేష్‌ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు

• మానవ హక్కుల నేతకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం ప్రదానం

• మాదాపూర్‌లో ఘనంగా ‘బీ ద చేంజ్’ సంస్థ అవార్డుల ప్రదానోత్సవం

• లండన్ ఎంపీల సమక్షంలో పురస్కారం అందజేత

• సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తానన్న అడ్వకేట్ సుంకర నరేష్

వాస్తవ నేస్తం,హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ సామాజిక సేవకుడు సుంకర నరేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం ఆయనను వరించింది. లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ పార్లమెంట్ గుర్తింపు పొందిన ‘బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్‌లోని మహీంద్రా క్యాంపస్‌లో జరిగిన ఘనమైన కార్యక్రమంలో సుంకర నరేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు రామ్ కళ్యాణ్ చల్లా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎ డికేడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు లండన్ పార్లమెంట్ సభ్యుడు జిమ్ డిక్సన్, లార్డ్ ఉదయ్‌కుమార్ నాగరాజు ప్రత్యేక మద్దతుగా నిలిచారు.

సుంకర నరేష్‌ సేవలకు సలాం..

విద్యార్థులు, మాజీ సైనికులు, నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం నరేష్ చేస్తున్న నిరంతర కృషిని సభ కొనియాడింది. మూగజీవాల సంరక్షణ కోసం ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చొరవను, యువతను సరైన మార్గంలో నడిపించేలా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

నా బాధ్యత మరింత పెరిగింది: సుంకర నరేష్..

అవార్డు స్వీకరించిన అనంతరం సుంకర నరేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా చురుగ్గా పనిచేస్తున్న ఒక సంస్థ నుంచి ఈ అవార్డును అందుకోవడం చాలా గర్వకారణం. ఈ పురస్కారం నాకు సరికొత్త శక్తినివ్వడంతో పాటు, నా సేవా కార్యక్రమాలను మరింత కొనసాగించేలా, విస్తృతం చేసేలా నాపై మరింత బాధ్యతను పెంచింది అని అన్నారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో లండన్ పార్లమెంట్ సభ్యుడు జిమ్ డిక్సన్, లార్డ్ ఉదయ్‌కుమార్ నాగరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ప్రముఖ అరుణోదయ కళాకారిణి విమలక్క, సంస్థ ప్రతినిధులు సుహాసిని, దేవ్, స్వప్న, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular