HomeCrime NewsDhaba(B) Sarpanch | విధుల్లో నిర్లక్ష్యం.. దాభా(బి) సర్పంచ్ పై వేటు

Dhaba(B) Sarpanch | విధుల్లో నిర్లక్ష్యం.. దాభా(బి) సర్పంచ్ పై వేటు

 * నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డ సర్పంచ్ తాత్కాలిక సస్పెన్షన్

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : తన బాధ్యతలను విస్మరించి, రైతులకు అనధికారంగా పత్తి విత్తనాలు విక్రయించిన ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం దాభా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్‌పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. దాభా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రైతులకు అనధికారికంగా పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 34 బస్తాల పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల అక్రమ విక్రయాలకు పాల్పడిన సర్పంచ్‌పై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు.

అయితే, సర్పంచ్ ఈశ్వర్ సమర్పించిన సంజాయిషీ అధికారులకు అసంతృప్తికరంగా ఉండగా, సర్పంచ్ పై ఆయనపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు అయినందున, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను సర్పంచ్ పదవిలో కొనసాగనివ్వడం సరికాదని జిల్లా కలెక్టర్.. తక్షణమే అమల్లోకి వచ్చేలా సర్పంచ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular