📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessGold | ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్.. బంగారం, వెండి, క్రిప్టో మార్కెట్లలో భారీ...

Gold | ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్.. బంగారం, వెండి, క్రిప్టో మార్కెట్లలో భారీ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడంతో గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ పరిణామంతో వడ్డీ రేట్లు త్వరలో తగ్గుతాయన్న అంచనాలు బలహీనపడ్డాయి. ఫలితంగా బంగారం, వెండి, క్రిప్టో మార్కెట్లలో భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. తాజా ట్రేడింగ్‌లో బంగారం ధరలు సుమారు 9 శాతం తగ్గగా, వెండి ధరలు 31 శాతం పైగా క్షీణించి దశాబ్దాల కనిష్ట స్థాయికి చేరాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే లోహాల్లోనే ఈ స్థాయి పతనం చోటు చేసుకోవడం మార్కెట్లలో పెరుగుతున్న అనిశ్చితిని సూచిస్తోంది.

వడ్డీ రేట్ల అంచనాలే కారణమా?

కెవిన్ వార్ష్ గతంలో (2006–2011) ఫెడరల్ రిజర్వ్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ద్రవ్యోల్బణ నియంత్రణకు కఠినమైన వడ్డీ విధానాలే సరైనవని ఆయన తరచూ అభిప్రాయపడ్డారు. తాజా నామినేషన్‌తో జూన్ నెలలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మార్కెట్ ఆశలు తగ్గిపోయాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా కొనసాగితే అమెరికన్ డాలర్ బలపడుతుంది. దాంతో బంగారం, వెండి వంటి లోహాలపై డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. ప్రస్తుతం మార్కెట్లలో అదే ధోరణి కనిపిస్తోంది.

స్టాక్, క్రిప్టో మార్కెట్లకూ దెబ్బ

ప్రభావం లోహాలకే పరిమితం కాలేదు. బిట్‌కాయిన్ ధర గత కొన్ని నెలల్లో తొలిసారిగా 80,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ ‘కోస్పి’ 5 శాతం కంటే ఎక్కువగా పడిపోవడంతో ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకుని, బలపడుతున్న డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి :  Gold Price Today: బంగారం కొనాలా? ఆగాలా? పెళ్లి సీజన్‌లో షాక్ ఇస్తున్న తాజా ధరలు

మార్కెట్ డేటా ప్రకారం జూన్ నెలలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ప్రస్తుతం 66 శాతం మాత్రమే ఉందని అంచనా. ఈ అనిశ్చితి కొనసాగితే, బంగారం మరియు వెండి ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెజాన్, ఆల్ఫాబెట్ వంటి ప్రముఖ కంపెనీల ఆదాయ ఫలితాలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిదని మార్కెట్ నిపుణుల సూచిస్తున్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88