వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: కొత్త సంవత్సరం వచ్చాక బంగారం ధరలు తగ్గుతాయన్న ఆశలతో ఉన్న పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు ఈ రోజు (డిసెంబర్ 5) మరోసారి షాక్ ఇచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల వ్యవధిలోనే బంగారం ధరలు భారీగా పెరిగి మార్కెట్‌ను కుదిపేశాయి.
ఉదయం సమయంలో బంగారం ధర సుమారు రూ. 1,580 పెరిగినట్లు నమోదవగా, సాయంత్రానికి అది రూ. 2,400 వరకు చేరింది. అంటే కొన్ని గంటల్లోనే మరో రూ. 820 మేర పెరుగుదల చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధి కూడా పూర్తికాకుండానే ఇంతటి మార్పు రావడం పసిడి మార్కెట్‌లో అరుదైన పరిణామంగా చెప్పుకోవచ్చు.
ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ. 1,37,400 వద్ద ఉండగా, సాయంత్రానికి రూ. 1,38,220కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 2,200 పెరిగి రూ. 1,26,700 వద్ద కొనసాగుతోంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,200గా నమోదవగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,27,600 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,370కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,26,850 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలూ పెరుగుదల బాటలోనే
బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరల్లో ఊగిసలాట కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
– Qamar SD
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్