వాస్తవ నేస్తం,బజార్‌హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని ఎల్లయ్యపల్లె సమీపంలో గల కడెం వాగులో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం లభించింది. మృతుడు గజిలి గ్రామానికి చెందిన చక్రం మాల్కు గా గుర్తించినట్లు తెలుస్తోంది. మండలంలోని వర్తమానూర్ శివారులో గల కడెం వాగులో ఒక మృతదేహం కొట్టుకువచ్చి నిలిచి ఉండటాన్ని శుక్రవారం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

