Friday, May 29, 2026
HomePolitical Newsకాంగ్రెస్ పార్టీలో మాదిగలకు తీవ్ర అన్యాయం

కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు తీవ్ర అన్యాయం

• నల్ల జెండాలతో ఎమ్మార్పీఎస్ నిరసన

• మండల అధ్యక్ష, నామినేటెడ్ పదవుల్లో దక్కని ప్రాతినిధ్యం

 • సీఎం రేవంత్ రెడ్డి స్పందించకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు : జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న మాదిగలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లాలో మెజార్టీ జనాభా ఉన్నప్పటికీ, ఏ ఒక్కరికీ మండల అధ్యక్ష పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో శుక్రవారం నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాదిగ మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 23 మండలాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను నియమించగా, అందులో ఒక్క మాదిగ నాయకుడికి కూడా అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి ఎస్సీ సెల్ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లోనూ మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించకుండా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్న మాదిగలను కేవలం జెండాలు మోసే కార్యకర్తలుగానే వాడుకుంటూ, రాజకీయంగా ఎదగకుండా అడుగడుగునా అవమానిస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 1న ఆసిఫాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభ నాటికి మాదిగలకు న్యాయం జరిగేలా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇదే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, గోటిముఖేల్ మధుకర్, సిరిసిల్ల భూమయ్య మాదిగ, మండల అధ్యక్షులు చిట్టి రవి, కాష్పాక విష్ణు, మచ్చ గంగయ్య, ఆరెపల్లి రవి, జుట్టు మల్లేష్, కొత్తూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular