Friday, May 29, 2026
HomeCrime Newsవిషాదం.. పెన్ గంగా వాగులో మునిగి బాలుడి మృతి

విషాదం.. పెన్ గంగా వాగులో మునిగి బాలుడి మృతి

• బేల మండలం సాంగిడి వద్ద ఘటన

• మృతుడు బేల వాసిగా గుర్తింపు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: బేల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని సాంగిడి గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న పెన్ గంగా వాగులో ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు వాగు వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా, మృతి చెందిన బాలుడు బేల గ్రామానికి చెందిన వాడిగా స్థానికులు ప్రాథమికంగా గుర్తించారు. బాలుడు వాగు వద్దకు ఎందుకు వెళ్ళాడు..? తోటి వారెవరైనా ఉన్నారా..? అనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular